Jul 29,2021 23:10

నీటిని వదులుతున్న దృశం

ప్రజాశక్తి - పగిడ్యాల: పగిడ్యాల కుంట వీదిలో ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యను పరిష్కరించినట్లు సర్పంచు పెరుమాళ్ళ శేషన్న, పంచాయితీ కార్యదర్శి గోపాల్‌ అన్నారు. గురువారం పగిడ్యాల కుంటవీధిలోని జిఎల్‌ఆర్‌ఎస్‌ ట్యాంక్‌కు మరమత్తులు చేసి నూతన కొళాయిలు అమర్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గత కొనేళ్ళుగా జిఎల్‌ఆర్‌ఎస్‌ ట్యాంక్‌ కొళాయిలు మరమ్మతులు చేయకపోవడంతో నీరు వృధా అవుతుండేదన్నారు. ట్యాంక్‌ సమస్యను కుంట వీధి వాసులు తమ దృష్టికి తీసుకొచ్చిన రెండు రోజులకే పరిష్కరించినట్లు చెప్పారు. పగిడ్యాల గ్రామంలో దాదాపు 90 శాతం ఇంటింటా కొళాయిలు ఉన్నాయన్నారు. ఎస్సీ కాలనీలకు (టవర్‌ వద్ద) వ్యక్తిగత కొళాయిలు లేవని, అధికారులతో చర్చించి ఇంటింటికి వేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మాజీ జెడ్పిటిసి పుల్యాల నాగిరెడ్డి, గొల్ల శేషన్న, వీరన్న, మోక్షేశ్వరరెడ్డి, ఓంకారం, వాటర్‌మెన్లు సురేష్‌, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.