Jul 29,2021 23:22

ప్రజాశక్తి-కొండపి: ప్రజలకు కావాల్సిన తాగునీరు అందించటంలో ఇరుగ్రూపులు ఇబ్బంది పెట్టే పనులు మానుకుని, తాగునీరు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మండల ప్రత్యేక అధికారి, కందుకూరు డిఎల్‌పిఒ భాస్కర్‌రెడ్డి తెలిపారు. స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెట్లూరు పంచాయతీ వాటర్‌ ప్లాంట్‌ విషయాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకోమని చెప్పినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఫిర్యాదుదారులను పిలిచి వారి నివేదికను తీసుకున్నట్లు తెలిపారు. రెండు రోజులలో కలెక్టరుకు సమర్పించనున్నట్లు చెప్పారు. వాటర్‌ ప్లాంట్‌ను పంచాయతీకి అప్పగించాలా.. లేదా.. అన్న దానిపై పరిశీలించి పరిష్కార మార్గం చూపుతామన్నారు. కార్యక్రమంలో ఎంపిడిఒ శ్రీనివాసులు ఉన్నారు.