May 15,2022 23:37

బోరు పనులు ప్రారంభిస్తున్న వైఎస్‌ ఎంపిపి

ప్రజాశక్తి-ముంచంగిపుట్టు:మండలంలో వనుగుమ్మ పంచాయతీ మొక్కఫుట్‌ గ్రామంలో తాగునీటి బోరు పనులను మండల వైస్‌ ఎంపీపీ 2 భాగ్యవతి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా భాగ్యవతి మాట్లాడుతూ, మారుమూల గ్రామాలలో తాగునీటి సమస్య పరిష్కారానికి జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్రకు తెలపగా స్పందించి నిధులు విడుదల చేశారన్నారు. ఈ మేరకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వార్డ్‌ మెంబర్‌ బుద్దు, గ్రామ వాలంటీర్‌ దేవా, బలరాం, రాజేంద్ర, గ్రామ పెద్దలు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.