Aug 19,2022 15:18

ప్రజాశక్తి - భీమవరం రూరల్‌
నియోజకవర్గ పరిధిలోని భీమవరం, వీరవాసరం, మండలాలకు సంబంధించి తాగునీటి సమస్య పరిష్కార నిమిత్తం జల జీవన్‌ మిషన్‌ పథకంలో రూ.20 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్‌ అన్నారు. పెదగరువు గ్రామ పంచాయతీ పరిధిలోని చిన గరువు గ్రామానికి శాశ్వత ప్రాతిపదికన రూ.60 లక్షలతో తాగునీటి సౌకర్యాన్ని మెరుగుపర్చనున్న నేపథ్యంలో చినగరువు గ్రామానికి చెందిన గ్రామ పెద్దలు శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాసును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామానికీ తాగునీటి సమస్య తెలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు నియోజకవర్గ స్థాయిలో జలజీవన్‌ మిషన్‌ పనుల ప్రారంభానికి చినగరువు గ్రామంలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపిపి పేరిచర్ల విజయ నరసింహరాజు, పంచాయతీ వార్డు మెంబర్లు బందెల సామేలు, పైడి మోషేన్‌, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.