
ప్రొ కబడ్డీ లీగ్
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్(పికెఎల్) సీజన్ా8లో దబాంగ్ ఢిల్లీ వరుసగా 7 విజయాన్ని సొంతం చేసుకుంది. మంగళవారం జరిగిన పోటీలో దబాంగ్ ఢిల్లీ 32-29 పాయింట్ల తేడాతో పట్నా పైరెట్స్ను ఓడించింది. ఢిల్లీ రైడర్లు విజయ్(9), సందీప్(8) రాణించగా.. ట్యాకిల్స్లో జీవా, మంజిత్ ఛిల్లార్ మెరిసారు. పట్నా జట్టులో ప్రసిధ్, సచిన్ రైడ్లో రాణించగా.. నీరజ్ ట్యాకిల్స్లో రాణించారు. ఈ విజయంతో దబాంగ్ ఢిల్లీ 7 విజయాలు, 2 ఓటమి, 2 డ్రాలతో సహా మొత్తం 42 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక గుజరాత్ జెయింట్స్ాయు ముంబ జట్ల మధ్య జరిగిన మరో పోటీ 24-24 పాయింట్లతో డ్రా అయ్యింది.