
దుబాయ్ : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) మంగళవారం విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్ బ్యాట్స్మన్ల జాబితాలో న్యూజిలాండ్‌కు చెందిన కేన్ విలియమ్సన్ టాప్‌లోనే కొనసాగుతున్నాడు. విలియమ్సన్ 919 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. స్టీవ్ స్మిత్ (900 పాయింట్లు) రెండో ర్యాంక్‌కు ఎగబాకాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి (870పాయింట్లు) మూడో స్థానానికి పడిపోయాడు. పాకిస్తాన్‌తో టెస్ట్ సిరీస్‌లో విలియమ్సన్ 238 పరుగులు బాది అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు. సిడ్నీ టెస్ట్‌లో రాణించిన ఛటేశ్వర పుజారా (50, 70 పరుగులు) 8వ ర్యాంక్, రిషబ్ పంత్ (36, 97 పరుగులు) 19 స్థానాలు ఎగబాకి 26వ స్థానంలో నిలిచాడు. ఇక భారత బ్యాట్స్మన్లు విహారి (52), అశ్విన్ (89), శుభ్‌మన్ (69)వ స్థానాల్లో నిలిచారు.