
విద్యార్థిని అభినందిస్తున్న ప్రధానోపాధ్యాయులు సాల్మన్
ప్రజాశక్తి-చీరాల: ఇటీవల రేపల్లెలో జరిగిన రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో ఆంధ్ర రత్న మున్సిపల్ హైస్కూల్‌కు చెందిన ఏడో తరగతి విద్యార్థి ఇనగంటి రాహుల్ బంగారు పతకం సాధించిన నేపథ్యంలో పాఠశాలలో శుక్రవారం అభినందన సభ జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బి సాల్మన్ రాజు మాట్లాడుతూ క్రీడలతో పాటు చదువులో కూడా చక్కగా రాణించాలని సూచించారు. వ్యాయామ ఉపాధ్యాయులు ఎన్ రమణారావు నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేంద్రప్రసాద్, గాంధీ, పవని భానుచంద్ర మూర్తి పాల్గొన్నారు.