May 05,2021 08:53

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో : రాష్ట్రంలో ప్రధానంగా దక్షిణ, ఆగేయ గాలులు వీస్తున్నందున పలుచోట్ల వర్షాలు పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు మంగళవారం తెలిపారు. రాగల 48 గంటల్లో ఉత్తర, దక్షిణ కోస్తాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. రాయలసీమలోనూ ఇదే వాతావరణం కొనసాగుతుందని వెల్లడించారు.