May 28,2023 22:19

కృష్ణదాస్‌ను సత్కరిస్తున్న వాణి

- వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్‌
ప్రజాశక్తి - పోలాకి: 
వచ్చే ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గంలో వైసిపి జెండా ఎగరాల్సిందేనని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. టెక్కలి నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జిగా నియమితులైన దువ్వాడ వాణి మబుగాంలో కృష్ణదాస్‌ను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి టెక్కలి నియోజకవర్గ నాయకులు సమన్వయంతో ఉన్నారని, ఎలాంటి లోటుపాట్లు, పొరపాట్లకు తావివ్వకుండా పనిచేయాలని సూచించారు. జగన్‌ ఆశీస్సులు మెండుగా ఉన్నాయని మంచి ఫలితం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచి, తన నియామకాన్ని బలపరిచి ప్రోత్సహించిన కృష్ణదాస్‌కు రుణపడి ఉంటానని వాణి అన్నారు.