May 17,2022 19:12

అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక దుప్పి ఉంది. దానికి ఒక చెట్టు పండ్లంటే చాలా ఇష్టం. ప్రతి రోజూవచ్చి ఆ చెట్లు పండ్లను తింటూ ఉంటుంది. ఆ సంగతి గమనించిన ఒక వేటగాడు దాన్ని వేటాడాలనుకున్నాడు. చెట్టు కింద బుట్టలో ఒక పండు పెట్టి ఉంచాడు. దానికి ఉచ్చు అల్లాడు. చెట్టు మీద కూర్చుని దుప్పి కోసం ఎదురు చూడసాగాడు. దుప్పి వచ్చి పండు తింటున్న సమయంలో వేటగాడు తాడు లాగాలని అనుకున్నాడు. దుప్పి వచ్చింది. చెట్టు కింద ఉన్న పండు పండిన వాసన వస్తుంది. కాని పండు ఉన్న తీరు దానికి అనుమానం కలిగింది. దూరంగా నిలబడి చూస్తూ ఉంది గాని, పండు దగ్గరకు రాలేదు. దాంతో వేటగాడికి అనుమానం వచ్చింది. దుప్పి ఈ ఉచ్చులో పడుతుందో? లేదో అనిపించింది. దాంతో చెట్టు మీద ఉండి, ఒక్కో పండు కిందకు విసరసాగాడు. దుప్పి వాటిని తింటూ ఉంది. కాని ఉచ్చు ఉన్న పండు దగ్గరకు మాత్రం రాలేదు. వేటగాడి పన్నాగాన్ని దుప్పి తెలివిగా తప్పించుకుని వెనుదిరిగి వెళ్లిపోయింది.
జీవంతిక

- పోరంకి జీవంతిక, 4వ తరగతి,
విశ్వశాంతి స్కూలు, ఉయ్యూరు.