Sep 25,2021 11:57

హైదరాబాద్‌ : తెలంగాణలో చికెన్‌ ధరలు మళ్లీ పెరిగాయి. శ్రావణ మాసం, వినాయకచవితి నవరాత్రులు సమయంలో చికెన్‌ వినియోగం తగ్గడంతో.. ధరలు కూడా తగ్గాయి. అయితే మళ్లీ వినియోగం పెరగడంతో కోడి మాంసం ధరలకు రెక్కలచ్చాయి. ప్రస్తుతం స్కిన్‌లెస్‌ చికెన్‌ ధర కిలోకు రూ.260 ఉండగా, స్కిన్‌ చికెన్‌ ధర రూ.230 ఉంది. గతంలో స్కిన్‌ లెస్‌ రూ.230, స్కిన్‌తో కూడిన చికెన్‌ ధర రూ.200గా ఉంది. ఈ వారం రోజుల వ్యవధిలోనే కిలోకు రూ.30 చొప్పున ధర పెరిగింది. అయితే హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో కిలో చికెన్‌ను రూ. 270కి కూడా అమ్ముడుతున్నారు. మటన్‌ ధర అధికంగా ఉండటంతో అనేక మంది చికెన్‌ను ఆశ్రయిస్తున్నారు. దీంతో దీని వినియోగం కూడా పెరిగింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో రోజుకు 1,800 మెట్రిక్‌ టన్నుల మాంసం వినియోగం అవుతుండగా... అందులో 45 శాతం చికెన్‌దే. హైదరాబాద్‌లో రోజుకు 810 మెట్రిక్‌ టన్నుల చికెన్‌ వినియోగం ఉన్నట్లు ఇటీవల చేపట్టిన ఓ సర్వేలో తేలింది. రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇదే నిష్పత్తిలో చికెన్‌ వినియోగం ఉండటం గమనార్హం. కోవిడ్‌ సమయంలో చికెన్‌ దుకాణాలకు బంద్‌ ప్రకటించడంతో కొనుగోలు తగ్గిపోయింది. దీంతో తీవ్రంగా వ్యాపారం దెబ్బతింది. లాక్‌డౌన్‌ తర్వాత రూ. 120గా ఉన్న చికెన్‌ ధర రూ. 160కి చేరింది. సెకండ్‌ వేవ్‌ ఆ సమయంలో రూ.160గా ఉంది. న్‌లో రూ. 200 దాటింది. జూలై నుంచి రూ.200 ధర దాటింది. ఇప్పుడు సెప్టెంబర్‌లో రూ. 260కి చేరింది. అయినప్పటికీ ప్రజలు కొనడం ఆపడం లేదు.