Jan 18,2022 14:22

ప్రజాశక్తి-మంత్రాలయం : పేద ప్రజలకు కూడా గూడు గుడ్డ అందించి వారి గుండెల్లో ఆరాధ్యులుగా నిలచిన మహోన్నత వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని టిడిపి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులురెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక శ్రీ నికేతన్ ఫంక్షన్ హాల్ లో ఎన్జీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలే దేవుళ్లు సమాజమే దేవాలయం అని భావించిన నేత నందమూరి తారక రామారావు అన్నారు. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని, తెలుగుజాతి కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం చంద్రబాబుకే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండలాధ్యక్షులు పన్నగ వెంకటేష్ స్వామి, మండల ప్రధాన కార్యదర్శి చావిడి వెంకటేష్, నాయకులు బూదూరు మల్లికార్జున రెడ్డి, వగరూర్ రామిరెడ్డి, విజయరామిరెడ్డి, గోపాలరెడ్డి, బాస్కర్ రెడ్డి, చిలకధన హునుమంతు, మంత్రాలయం యంపిటిసి వెంకటేష్, డీసీ తిమ్మప్ప, యేబు రచ్చమర్రి వీరేశ్, చిదానంద, చిన్నారెడ్డి, రామంజి, తిమ్మాపురం, కేశవ, మాలపల్లి చంద్ర, లక్ష్మయ్య, పర్మాన్ దొడ్డి శంకర్ నాయక్, దిద్ది నాగేష్, లింగప్ప, యస్సీ సెల్ ఉపాధ్యక్షులు విజయ్ కుమార్ హల్వి, నాగరాజు, మరియు ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.