Jan 19,2022 16:04

ప్రజాశక్తి - ఆలమూరు :తెలుగునాట పుట్టి మహోన్నత సాహితీ శిఖరాలను అందుకున్న మానవతామూర్తి యోగి వేమన అని, ఆయన తెలుగు సాహిత్య సురదపి అని మాజీ సర్పంచ్‌, సీనియర్‌ నాయకులు ద్వారంపూడి అప్పారెడ్డి అభివర్ణించారు. వేమన జయంతి సందర్భంగా మండలంలోని జన్నాడ మల్లేశ్వర స్వామి వారి ఆలయం వద్ద గల యోగివేమన శిలా విగ్రహానికి బుధవారం వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ సమాజంలోని అసమానతలను వెలుగు చూపుతూ జీవిత సత్యాలను వేమన వివరించారన్నారు. మానవీయ కోణంలో నిత్యాన్వేషణగా కొనసాగుతూ విమర్శించిన వివేకిగా వేమన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారన్నారు. ప్రజాకవిగా, మానవతావాదిగా పేరొందిన, వేమన పద్యాలు బాలల దగ్గరనుంచి వఅద్ధుల వరకు సుపరిచితం అన్నారు. దుష్ట సంప్రదాయాలను, మూఢాచారాలను, విగ్రహారాధనలను, కుల వివక్షను, మత మౌఢ్యాలను, స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలను ఇలా ఒకటేమిటి సమాజానికి హాని కలిగించే అన్నింటినీ సూటిగా, ఘాటుగా తన సాహితీ పంక్తులతో ప్రజలను చైతన్యవంతులను చేశారన్నారు. అలాంటి మరుపురాని మహత్తర సురదఅపికి వందనాలు సమర్పించడం తెలుగు వారి అందరి కర్తవ్యమన్నారు. ఈ కార్యక్రమంలో వేమన సంఘం అధ్యక్షులు తాడి తమ్మిరెడ్డి, ఉపాధ్యక్షులు మేడపాటి రామారెడ్డి, ట్రెజరర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, గౌరవ అధ్యక్షులు తాడి శ్రీనివాస్‌ రెడ్డి, గ్రామ ఉపసర్పంచ్‌ నాగ మోహన్‌ రెడ్డి, సొసైటీ బ్యాంక్‌ చైర్మన్‌ తాడి మెహెర్‌ ఆదిత్య రెడ్డి, తాడి వెంకన్నబాబు, నల్లమిల్లి రామారెడ్డి, తాడి శ్రీనివాస్‌ రెడ్డి(బట్టిశ్రీను), పడాల శివ శ్రీనివాస్‌ రెడ్డి, మేడపాటి వెంకట కఅష్ణారెడ్డి, మల్లిడి సుబ్బిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.