
ప్రజాశక్తి-తిరువూరు: యుటిఎఫ్ సౌజన్యంతో ప్రచురింప బడిన పదవ తరగతి స్టడీ మెటీరియల్ ను స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పా ఠశాలలో మంగళవారం బాలికలకు పంపిణీ చేశారు. కాపు సంఘ అధ్యక్షు లు రాంబాబు, హన్షు ఆర్థోపెడిక్ ఆసు పత్రి డాక్టర్ చంద్రశేఖరెడ్డి సతీమణి డాక్టర్ శతిరెడ్డి వితరణతో ఈమెటీరి యల్ ఉచితంగా పంపిణీ చేసినట్లు ప్రధానోపాధ్యాయిని నాగకుమారి తెలి పారు. విద్యార్థినులు స్టడీ మెటీరియల్ ఉపయోగించుకొని ఉత్తమ స్థానం సా ధించి ఉన్నతులుగా ఎదగాలని పెద్దలు దాతలు పేర్కొంటు మరిన్ని సేవా కార్య క్రమాలకు తమవంతు సాయం చేస్తా మని చెప్పారు. ఈకార్యక్రమంలో కాపు సంఘం నాయకులు పసుపులేటి వెంకయ్య, ఉయ్యూరు జయప్రకాష్, వరల క్ష్మి, యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎన్. వెంకటేశ్వర్లు, జిల్లా కౌన్సిల్ సభ్యురాలు ఇవి భరతకుమారి, మోదుగుసుధాకర్, ఏసుపాదం, ఏడుకొండలు, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.