సాంఘిక సంక్షేమ హాస్టళ్ల గోడు పట్టదా? : ఎస్ఎఫ్ఐప్రజాశక్తి – క్యాంపస్ తిరుపతి జిల్లాలో దాదాపుగా 130 పైగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయని, పదివేల మంది విద్యార్థులు వీటిల్లో ఉంటూ చదువు కొనసాగిస్తున్నారని, అయితే నాలుగు నెలలుగా మెస్సు బిల్లులు రాక వార్డెన్లు అవస్థలు పడుతున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భగత్రవి, అధ్యక్షులు అక్బర్ తెలిపారు. సోమవారం ‘స్పందన’ కార్యక్రమంలో భాగంగా జేసీకి వినతిపత్రం సమర్పించారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల సమస్యలు పట్టించుకోవాలని విన్నవించారు. నాలుగు నెలలుగా మెస్సు బిల్లుల బకాయిలు ఉంటే పిల్లలు ఏమి తిని బతకాలని ప్రశ్నించారు. విద్యార్థులకు పౌష్టికాహారం ఏ విధంగా అందిస్తారన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు తేజ, శివ, నగర నాయకులు శ్రీనివాసులు, బాల, హర్షద్, గణేష్ పాల్గొన్నారు.
సాంఘిక సంక్షేమ హాస్టళ్ల గోడు పట్టదా? : ఎస్ఎఫ్ఐప్రజాశక్తి – క్యాంపస్ తిరుపతి జిల్లాలో దాదాపుగా 130 పైగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయని, పదివేల మంది…