విజయ్ శంకర్, విషిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘విజయ్ శంకర్, విషిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘పాగల్ వర్సెస్ కాదల్’. లవ్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఈనెల 9న విడుదల కానుంది. శివత్రి ఫిలింస్ బ్యానర్‌పై పడ్డాన మన్మథరావు నిర్మిస్తున్నారు. రాజేశ్ ముదునూరి దర్శకత్వం వహిస్తున్నారు. బ్రహ్మాజీ, షకలకశంకర్, ప్రశాంత్ కూచిబట్ల, అనూహ్య సారిపల్లి ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. గురువారంనాడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. హీరో విజయ్ శంకర్ మాట్లాడుతూ ‘ఈ సినిమా రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా మీ ముందుకొస్తోంది. నేను కార్తీక్ అనే క్యారెక్టర్‌గా నటిస్తున్నా. సినిమా ప్రేమలో ఉన్న ప్రతి లవర్ రిలేజ్ చేసుకునేలా ఉంటుంది. ప్రియ పాత్రలో విషిక అద్భుతంగా నటించంది. ‘పాగల్ వర్సెస్ కాదల్’ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరించాలని కోరుతున్నా’ అన్నారు.
