Apr 07,2021 19:43

నేడు అల్లు అర్జున్‌ పుట్టినరోజు సందర్భంగా బుధవారం 'పుష్ప' టీజర్‌ విడుదల చేసింది చిత్రబృందం. ఈ చిత్రం ఎర్ర గంధపు అక్రమ రవాణాతో ముడిపడి ఉన్న వారి జీవితాల చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ నటుడు ధనంజరు, ప్రకాష్‌రాజ్‌, జగపతి బాబు, హరీష్‌ ఉతామన్‌, వెన్నెల కిషోర్‌, అనీష్‌ కురువిల్లా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆస్కార్‌ అవార్డును అందుకున్న సౌండ్‌ డిజైనర్‌ రేసుల్‌ పూకుట్టిని రంగంలోకి దింపుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీత సారథ్యం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ నిర్మిస్తున్నారు.

టీజర్ చూసేందుకు దీనిపై క్లిక్ చేయండి