Nov 29,2021 22:25

తహశీల్దార్‌ పరమేశ్వరస్వామి

ప్రజాశక్తి -తొట్టంబేడు: తొట్టంబేడు మండల తహశీల్దార్‌ పరమేశ్వర స్వామి సేవలపై మండల ప్రజలు సర్వత్రా అభినందనలు తెలియజే స్తున్నారు. గతంలో కరోనా ఫస్ట్‌, సెకండ్‌ వేవ్‌లో కూడా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ బయటికి రావా లంటే భయ పడుతున్న సమయంలో గ్రామాల్లో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు సేవలందిస్తూ ఉన్నత అధికారులకు సమాచారం ఇస్తూ జిల్లా అధికారుల చేత శభాష్‌ అనిపించుకున్నారు. మండలంలో మొట్ట మొదటిగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా వ్యాక్సిన్‌ వేయించుకుని అందరికి ఆదర్శప్రాయంగా నిలవడంతో పాటు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని గ్రామా లలో తిరుగుతూ గ్రామస్తులకు అవగాహన కల్పించారు. వైద్య శాఖను అప్రమత్తం చేస్తూ మండలంలో అత్యధికంగా కరోనా వ్యాక్సిన్‌ వేసుకునే విధంగా కషి చేశారు. ప్రస్తుతం భారీ వర్షాల నేపథ్యంలో చాలా చోట్ల రైతులు పంట పొలాలు నీట మునిగి పోవడం, గిరిజన కాలనీల్లో కొందరు ఇల్లు పడిపోయి నిరాశ్రయులైనవారు, వరదలతో రోడ్లు దెబ్బ తినడం వంటి నష్టాలు జరిగాయి. ఎప్పటికప్పుడు నష్టానికి సంబంధించిన నివేదికలను జిల్లా అధికారులు అందించారు. భారీ వర్షాలు పడుతున్నా తమ వీధుల్లో భాగంగా ఎప్పటికప్పుడు సమస్యలు ఉన్న చోట ముందస్తు చర్యలు తీసుకుంటూ ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ, తుఫానుకు నష్టపోయిన పాడి రైతులకు నష్ట పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకుంటూ రైతులు కూడా ప్రభుత్వం తరఫున సాయం చేస్తున్నారు. చెరువులకు ఎక్కడ గండి పడిన అక్కడకు చేరుకుని సర్పంచులు, గ్రామస్థుల సాయంతో వెంటనే మరమ్మతులు చేయిస్తున్నారు. తుపాన్‌ ప్రభావం ఎక్కువగా ఉందని గత రెండు రోజుల నుంచి రాత్రిపూట కూడా కార్యాలయంలోనే ఉంటూ మండల ప్రజలకు సేవలందిస్తున్నారు. పట్టువదలని విక్రమార్కుడిలా మండలానికి అలుపెరగని సేవలందిస్తున్న తహశీల్దార్‌ పరమేశ్వర స్వామికి మండల ప్రజలు తెలియజేస్తున్నారు.