
ప్రజాశక్తి - అద్దంకి
చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ టిడిపి ఆధ్వర్యంలో స్థానిక రామాటాకీస్ స్థలంలో (బస్టాండ్ ఎదురుగా) 7వ రోజు రిలే నిరాహార దీక్ష మంగళవారం చేశారు. బల్లికురువ మండలానికి చెందిన టిడిపి కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కూర్చున్నారు. సందర్భంగా పలువురు టిడిపి నాయకులు మాట్లాడుతూ నిరంకుశ తత్వంతో జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయిస్తున్నారని అన్నారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని అన్నారు. అధికారులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చట్టప్రకారం నడుచుకోవాలని కోరారు.