Jul 03,2022 23:48

సభ్యత్వ నమోదు పాల్గొన్న అప్పలరాజు తదితరులు

ప్రజాశక్తి- పిఎం పాలెం : తెలుగుదేశం పార్టీ భీమిలి నియోజక వర్గం ఇన్‌ఛార్జి కోరాడ రాజాబాబు, వార్డు కార్పొరేటర్‌ మొల్లి హేమలత ఆదేశాలతో జివిఎంసి 5వ వార్డు పరిధి వైఎస్సార్‌ కాలనీలో టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పార్లమెంటరీ కార్యదర్శి వాండ్రసి అప్పలరాజు ముఖ్య అతిథిగా పాల్గొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గుర్తింపుకార్డులు త్వరలోనే అందిస్తామన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ తప్పనిసరిగా సభ్యత్వ నమోదు చేసుకోవాలని, పార్టీ సభ్యత్వంతో పాటు రెండేళ్ల వరకు ప్రమాద బీమా ఉందని, రూ.2లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని వివరించారు. కార్యకర్తలంతా నిత్యం ప్రజలతో ఉండి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి తిరిగి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ఎస్‌సి సెల్‌ అధ్యక్షులు లంక రాజేంద్రప్రసాద్‌ (పొట్టిప్రసాద్‌), సెక్రటరీ ఈగల రవి, ఓలేటి శ్రావణ్‌, మొకర రవి, సత్యనారాయణ, నూకరాజు, మోహనరావు, హరికృష్ణ, రవి, రాజు, మదీనా, విష్ణు, మాధవ, అనురాధ, సత్యవతి, పార్టీ అభిమానులు, కార్యకర్తలు సభ్యత్వ నమోదు చేసుకున్నారు.