Aug 07,2022 22:25

ఫొటో : సమావేశంలో మాట్లాడుతున్న మాలేపాటి సుబ్బానాయుడు

ఫొటో : సమావేశంలో మాట్లాడుతున్న మాలేపాటి సుబ్బానాయుడు
టిడిపి సమీక్షా సమావేశం
ప్రజాశక్తి-కావలి : పట్టణ మద్దూరుపాడు 1వ వార్డులో టిడిపి వార్డు సమీక్షా సమావేశం ఆదివారం వార్డు అధ్యక్షులు కొండా వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి మాలేపాటి సుబ్బానాయుడు హాజరై, మద్దూరుపాడులో టిడిపి బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని వార్డు నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం వార్డులో జగనన్న బాదుడే-బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి బాదుడే బాదుడు కరపత్రాలను పంచిపెట్టారు.
ఈ సందర్భంగా మాలేపాటి సుబ్బానాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో నిత్యవసర వస్తువుల ధరలు గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ రెట్లు ఏ విధంగా ఉన్నాయో మరి ఈరోజు ఈ నిత్యవసర వస్తువుల ధరలు ఏ విధంగా పెరిగాయో ప్రజలు ఆలోచించాలని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేసి వైసిఇప ప్రభుత్వాన్ని గద్దెదించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర, పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు గుత్తికొండ కిషోర్‌ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, పోతుగంటి శ్రీకాంత్‌, వార్డు నాయకులు కొమర వెంకటేశ్వర్లు, పిలిమిట్ల సుబ్రహ్మణ్యం, పులి శ్రీనివాసులు, ఆర్‌ రాఘవేంద్రరావు, సిహెచ్‌.శ్రీనివాసులు, బాలమురళి, కొండలరావు, తిరుపతి, అక్కిలిగుంట సూర్యప్రకాశరావు, కోవూరు వెంకటనారాయణ, తదితరులు పాల్గొన్నారు.