Feb 23,2021 12:41

విశాఖ : కార్పొరేషన్‌ ఎన్నికల వేళ.. టిడిపి కి ఊహించని గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టిడిపి తరుపున నామినేషన్‌ వేసిన అభ్యర్థులు వైసిపి లో చేరి ట్విస్ట్‌ ఇస్తున్నారు. గతేడాది ఎన్నికల ప్రక్రియ సందర్భంగా.. 14 వ డివిజన్‌లో టిడిపి తరుపున నామినేషన్‌ వేసిన అభ్యర్థి నరసింహరాజు అలియాస్‌ బాక్సర్‌ రాజు వైసిపి కండువా కప్పుకున్నారు. మరో ఇద్దరు అభ్యర్థులు కూడా వైసిపిలో చేరనున్నట్లు సమాచారం. టిడిపి నుండి వలసలు మొదలయ్యాయని, త్వరలో మరింతమంది వైసిపిలో చేరతారని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. కొన్ని వార్డుల్లో ఏకగ్రీవాలు కూడా చేస్తామని విజయసాయిరెడ్డి చెప్పడం చర్చనీయాంశంగా మారింది.