May 17,2022 23:38

మాట్లాడుతున్న అడిగర్ల అప్పలనాయుడు

తెలుగుదేశం 40 వసంతాల ఆవిర్భావ వేడుకలోఅడిగర్ల
ప్రజాశక్తి-గొలుగొండ
: మండలంలో రావణాపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి సర్పంచ్‌ కొల్లు నూకరత్నం, మాజీ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ కొల్లు సత్తిబాబు ఆధ్వర్యంలో టిడిపి 40 వసంతాల ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా మండల పార్టీ అధ్యక్షులు అడిగర్ల అప్పలనాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అప్పలనాయుడు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టిడిపి గెలుపు నాయకులు కార్యకర్తలు కషి చేయాలన్నారు. ప్రజలంతా వైసిపికి అధికారం ఇచ్చి ఎంత తప్పు చేశారో తెలుసుకున్నారన్నారు. అదుపులో లేని నిత్యావసర ధరలు అప్రకటిత విద్యుత్‌ కోతలతో ప్రజలు విసుగు చెందారన్నారు. రానున్న ఎన్నికల్లో టిడిపికి పట్టం కట్టడానికి వారంతా ఎదురు చూస్తున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు భీమిరెడ్డి సత్యనారాయణ, కొత్త ఎల్లవరం సర్పంచ్‌ కొల్లు రాంబాబు, మాజీ ఎంపిటిసి రవివర్మ, ఏటిగైరంపేట ఎంపిటిసి కాంతమ్మ, గెడ్డం ఆనంద్‌ సుర్ల బాబ్జి, స్థానిక నాయకులు బెల్లపు కొండలరావు పాల్గొన్నారు