
ప్రజాశక్తి-రామచంద్రపురం ప్రజాశక్తి వార్తకు స్పందన పట్టణ పరిధిలోని టిడ్కో గహాల్లో ఈగలు పెరిగి పోవడంపై ప్రజాశక్తిలో ప్రచురించిన కథకానికి అధి కారులు స్పందించారు. ఈ మేరకు శుక్రవారం కొత్తూరు టిడ్కో గృహాల్లో ఈగల బెడదపై మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి స్పందించి ఈగల మందులు పిచికారీకి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశిం చారు. ఎప్పటికప్పుడు టిడ్కో గహల పరిసరాల్లో ప్రత్యేక శానిటేషన్ నిర్వహించాలని, ప్రజల్లో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని, ఆహార వ్యర్థపదార్థాలు, చెత్త బయట వేయరాదని, ఎప్పటికప్పుడు పారిశుధ్యంపై సమాచారం అందించాలని శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు సూచించారు. ఈ మేరకు టిడ్కో గృహ సముదాయాల్లో సిబ్బంది ఈగల మందులు పిచికారీ చేశారు.