Nov 25,2021 12:18

హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి కరోనా బారినపడ్డారు. ఆయనకు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో ఆస్పత్రిలో చేరారు. తనను కలిసినవారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని శ్రీనివాసరెడ్డి కోరారు. ఇటీవల జరిగిన మనవరాలి పెళ్లిలో తెలుగు రాష్ట్రాల సిఎం లను పోచారం శ్రీనివాసరెడ్డి కలిశారు.