Nov 25,2021 12:09

అడిస్‌ అబాబా : టిగ్రే ప్రాంతానికి చెందిన రెబల్స్‌తో జరుగుతున్న పోరాటంలో ప్రభుత్వ దళాలకు ఇథియోపియా ప్రధాని, 2019 నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత అబీ అహ్మద్‌ మద్దతున్విడమే కాకుండా స్వయంగా రంగంలోకి దిగారు. ఈ పోరాటానికి ఆయన నేతృత్వం వహిస్తున్నారు. ఉత్తర ఆఫ్రికాలోని అత్యంత జనాభా కల్గిన రెండవ దేశమైన ఇధియోపియాలోని ఉత్తర టిగ్రే ప్రాంతంలో ఏడాదిగా కొనసాగుతున్న ఈ పోరాటంలో అనేక మంది చనిపోగా.. అనేక మంది నిరాశ్రయులయ్యారు. అదేవిధంగా కరువు, కాటకాలతో దేశం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. టిగ్రే తిరుగుబాటు దారులు రాజధాని అడిస్‌అబాబాపై దాడి చేసే అవకాశాలున్నందున తమ పౌరులను విడిచిపెట్టాలని ..పరాయి దేశాలు కోరుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వం జరుపుతున్న ఎదురుదాడికి దేశ ప్రధాని అబీ అహ్మద్‌ నేతృత్వం వహించడం చర్చనీయాంవమైంది. దీన్ని స్థానిక మీడియా ధ్రువపరిచింది. కాగా, ఆర్మీలో రేడియో ఆపరేటర్‌ నుండి.. లెఫ్టినెంట్‌ కల్నల్‌ వరకు ఎదిగిన అబీ ఎక్కడ మోహరించారో తెలుపలేదు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా విడుదల చేయలేదు.