Sep 15,2021 22:03

subhashini

టీచర్‌ సుభాషిణికి డాక్టరేట్‌
గన్నవరం : గన్నవరం మండలం దావాజీగూడెం ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయురాలు పెదపూడి సుభాషిణి డాక్టరేట్‌ పొందినట్లు ప్రధాన ఉపాధ్యాయులు విజయరామారావు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రం మైసూర్‌ ఏషియన్‌ వేదిక్‌ కల్చరల్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ ప్రధానం చేసినట్లు తెలిపారు. సుభాషిణి 'విద్య' అనే అంశంపై పిహెచ్‌డి చేసినట్లు వివరించారు. డాక్టరేట్‌ అందుకున్న ఆమెను పాఠశాల ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది అభినందించారు. ఆమె నాగార్జునా యూనివర్శిటీలో మాస్టర్‌ తెలుగు డిగ్రీ పొందారు. 20 ఏళ్లుగా ఉపాధ్యాయ వత్తిలో రాణిస్తున్నారు.