
తాడేపల్లి: తాడేపల్లి మున్సిపల్ కార్యాలయం నుంచి కొండ చుట్టూ గల కొండ పోరంబోకు ప్రాంతాల్లో నివశిస్తున్న ఇండ్ల ప్రజల కష్టాలు త్వరలో తీరనున్నాయి. కొండ చుట్టూ నివాసమున్న ఈ ప్రాంతం గ్రామకంఠం ఉంది. ఈ భూమిని గత ప్రభుత్వాలు 22ఎ లిస్టులో చేర్చాయి. 201 సర్వే నెంబర్ పేరుతో 80 ఎకరాల విస్తీర్ణం గల గ్రామకంఠం, కొండ పోరంబోకు కలిపి ఉన్న ఈ భూమి లో సుమారు వెయ్యి కుటుంబాలు నివాసముం టున్నా యి. 34 సంవత్సరాల నుంచి ఆపైన వంద సంవత్స రాల నుంచి వారసత్వంగా నివాసముంటున్న కుటుం బాలు ఉన్నాయి. 22ఎ లిస్టు సబ్ డివిజన్ చేయ డానికి రెబెన్యూ, కార్పొరేషన్ అధికారులు సోమవారం స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సమా వేశమయ్యారు. ఒకే సర్వే నెంబర్‌గా ఉన్న ఈ భూమిని ఇటీవల సచివాలయ అధికారులు 20 సబ్ డివిజన్లుగా మార్పు చేశారు. ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ నివశిస్తున్న ప్రజలు పన్నులు చెల్లిస్తున్నా రిజిస్ట్రేషన్లకు నోచుకోని పరిస్థితి నెలకొంది. 201లోని 80 ఎకరాల భూమిని సబ్ డివిజన్ చేయడానికి స్థానిక ఎంఆర్‌ఒను కలెక్టర్, సబ్‌కలెక్టర్‌కు ఫైల్ పంపించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఏప్రిల్ చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. అదే జరిగితే తమ కష్టాలు గట్టెక్కినట్టే నని కొండిపాంత వాసులు భావిస్తున్నారు.