May 04,2021 10:01

తిరుపతి : తిరుమల దుకాణాల వద్ద అగ్నిప్రమాదం సంభవించి ఆరు దుకాణాలు దగ్ధమయ్యాయి. మంగళవారం ఉదయం వెంకటేశ్వరుడి ఆస్థాన మండపం వద్ద ఉన్న దుకాణాల్లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. మంటలు రాజుకొని ఆరు దుకాణాలు దగ్ధమయ్యాయి. ఈ సమాచారాన్ని అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.