Jun 10,2021 19:56

తిరుమల : తిరుమలలో అద్దె గదుల కేటాయింపును మరింత సులభతరం చేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) శ్రీకారం చుట్టింది. సాధారణ భక్తులకు గదుల కేటాయింపునకు ఆరు చోట్ల రిజిస్ట్రేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. జిఎన్‌సి, బాలాజీ బస్టాండ్‌, కౌస్తుభం, రామ్‌ భగీచ, ఎంబిసి, సిఆర్‌ఒ వద్ద రిజిస్ట్రేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని టిటిడి నిర్ణయించింది. ఈ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్నవారికి ఎస్‌ఎంఎస్‌ ద్వారా గదుల సమాచారం చేరుతుంది. ఎస్‌ఎంఎస్‌ వచ్చిన వెంటనే భక్తులు నగదు చెల్లించి గది పొందేలా ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం 8 గంటలకు రిజిస్ట్రేషన్‌ కేంద్రాలను టిటిడి అధికారులు ప్రారంభించనున్నారు.