Jan 23,2022 09:02

ప్రజాశక్తి-తిరుపతి : చిత్తూరు జిల్లా తిరుపతి ఐఐటి క్యాంపస్‌లో కరోనా కలకలం రేపింది. ఏర్పేడు సమీపంలోని ఐఐటి ప్రాంగణంలో 75 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. క్యాంపస్‌లో 214 మంది విద్యార్థులు, సిబ్బందికి కరోనా పరీక్షలు చేయగా.. 45 మంది విద్యార్థులు, 30 మంది సిబ్బందికి పాజిటివ్‌గా తేలినట్టు శనివారం అధికారులు వెల్లడించారు. దీంతో ఐఐటి వసతి గృహాన్నే కొవిడ్‌ కేంద్రంగా మార్చారు. ఈ నెల మొదటి వారంలో సుమారు 600 మంది విద్యార్థులు తమ సొంత ప్రదేశాలకు వెళ్లడంతో ప్రస్తుతం బిటెక్‌, ఎంటెక్‌, పిహెచ్‌డి చివరి సంవత్సరం విద్యార్థులు మాత్రమే క్యాంపస్‌లో ఉన్నారని యాజమాన్యం తెలిపింది.