Jan 13,2021 14:11

తిరువూరు (కృష్ణా) : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతులకు నష్టదాయకమైన వ్యవసాయ చట్టాల కాపీలను, ప్రజలపై భారాలు మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇంటి పన్నుల జీఓ కాపీలను రైతు సంఘాల, పట్టణ పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నాయకులు, రైతులు కలిసి భోగి మంటలో దగ్ధం చేశారు. తిరువూరు బోసుబొమ్మ ఆటో స్టాండ్‌ సెంటర్లో నిర్వహించిన ఈ నిరసనలో రైతు సంఘం పశ్చిమ కృష్ణా అధ్యక్షుడు సానికొమ్ము నాగేశ్వరరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు మేకల నాగేంద్రప్రసాద్‌, గుంజా కృష్ణమోహన్‌, కొత్తపల్లి సుందరరావు, పల్లెపాటి శ్రీనివాసరావు, జీవన్‌ బాబు, ఎస్వీ భద్రం, బి.జె.సుందరరావు, ఎం.ప్రభాకరరావు, తదితరులు పాల్గొన్నారు.