Sep 16,2021 00:18

కాటసాని రాంభూపాల్‌ రెడ్డి

ఎంపిక పట్ల వైసిపినేతల హర్షం
ప్రజాశక్తి -ఓర్వకల్లు: 
ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలకమండలి సభ్యులలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌ రెడ్డికి స్థానం దక్కింది. కాటసానికి టిడిపి పాలకమండలి సభ్యునిగా నామినేట్‌ కావడం పట్ల వై సిపి రైతు విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నన్నూరు మాజీ సర్పంచి చెన్నారెడ్డి బుధవారం హర్షం వ్యక్తం చేశారు. మాట్లాడుతూ సుదీర్ఘ కాలం రాజకీయాలలో ఉన్నపటికీ పదవులు కేవలం అలంకార ప్రాయం కాకుండా వాటికి వన్నె తెచ్చే విధంగా కాటసాని రాంభూపాల్‌ రెడ్డి వ్యవహార శైలి ఉంటుందని చెన్నారెడ్డి తెలిపారు. చెన్నారెడ్డితోపాటు తులసీధర్‌రెడ్డి, నన్నూరు వైసిపి కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.