Jan 16,2021 11:41

బి కొత్తకోట (చిత్తూరు) : టివిఎస్‌ బండి పై నుండి మహిళ జారిపడి మృతి చెందిన ఘటన శనివారం చిత్తూరు బి కొత్తకోట మండలంలో చోటు చేసుకుంది. గట్టు గ్రామం హరిజనవాడ కు చెందిన అంజమ్మ తన భర్తతో కలిసి టివిఎస్‌ బండి పై వెళుతూ నాయన బావి వద్ద ఒక్కసారిగా జారిపడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అంజమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.