Jun 10,2021 18:31

పిల్లలతో ఆరోగ్యకర అనుబంధాన్ని పెంచుకోవాలనుకుంటే... ప్రెగెన్సీ సమయంలో ఒత్తిడికి గురవకుండా ఉండాలని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ రీసెర్చి (ఎన్‌ఐహెచ్‌ఆర్‌) సెంటర్‌ చెబుతోంది. సృష్టిలో ఏ జీవుల్లో అయినా సరే తన పిల్లల పట్ల అమితమైన ప్రేమ కురిపిస్తుంది తల్లి.కానీ పుట్టిన పిల్లలు తల్లిపై చూపించే ప్రేమలో హెచ్చుతగ్గులుంటాయట. దీనంతటికి కారణం తల్లి ఎదుర్కొనే ఒత్తిడి అని తేల్చారు శాస్త్రవేత్తలు. ఈ అధ్యయనం కోసం 131 మంది తల్లులు ఈ స్టడీలో పాల్గొన్నారు. వీరిని మూడు గ్రూపులుగా విభజించారు. గతంలోగానీ, గర్భిణీ సమయంలో గానీ ఎటువంటి ఒత్తిడికి లోను కానీ ఆరోగ్యవంతమైన 51 మందిని ఒక గ్రూప్‌ చేశారు. ప్రస్తుతం ఒత్తిడినికి ఎదుర్కొంటున్న 52 మంది గర్భిణీలను రెండో గ్రూప్‌గా, గతంలో ఒత్తిడిని ఎదుర్కొని ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్న 28ని మూడో గ్రూప్‌గా చేశారు. వీరందరిని ప్రసవానంతరం ఆరు వారాలు, 12 నెలల తల్లి-శిశువు మధ్య జరిగే మూగ సంభాషణలను వీడియోల ఆధారంగా విశ్లేషించారు. తమ బిడ్డలను ఈ అమ్మలు లాలిస్తున్న క్రమంలో ... పిల్లలు వారి తల్లిని చూసినప్పుడు వారి ముఖ కవళికలు, పరిస్థితి, శరీర అవయవాల కదలికలు వంటి ప్రవర్తనకు సంబంధించిన అన్ని రకాల అంశాల ఆధారంగా తల్లీబిడ్డల మధ్య ప్రేమను అంచనా వేశారు.

లక్షణాల్లో మార్పులు
ఎనిమిది వారాలు ఉన్న పిల్లలు ప్రెగెన్సీ సమయంలో తమ తల్లులు పూర్తిగా ఒత్తిడికి గురైన వారు... తల్లులపై 62 శాతం మేర ఎటువంటి ప్రేమను కనబరచలేకపోయారు. గతంలో ఒత్తిడికి గురైన తల్లుల పట్ల తమ పిల్లలు 56 శాతం ప్రేమ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఇక ఆరోగ్యంగా ఉన్న మహిళల్లో 32 శాతం ప్రభావం కనిపించింది. అయితే 8 వారాల నుంచి 12 నెలలకు వచ్చే సరికి పిల్లలు తల్లులపై ఇంటరాక్షన్‌ లెవెల్స్‌ పెరిగినట్లు అధ్యయనంలో వెల్లడైంది.


పిల్లలు తమ తల్లుల మధ్య ప్రవర్తన తీరులో మార్పుకు కారణాల్లో సామాజిక ఆర్థిక అంశాలు కూడా ఒక భాగం అని అధ్యాపకులు అంటున్నారు. ప్రారంభదశలో ఉన్నప్పుడే ఈ ఒత్తిళ్లకు సంబంధించి తల్లులు సరైన చికిత్స తీసుకోవాలని లండన్‌ కింగ్స్‌ కాలేజ్‌ రీసెర్చి అసోషియేట్‌ డాక్టర్‌ రెబెకా బైండ్‌ తెలిపారు. లేకుంటే భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుందని అన్నారు.