Oct 13,2021 07:11

అంతర్జాతీయ సమాజానికి తాలిబన్ల విజ్ఞప్తి
కాబూల్‌ :
ఆఫ్ఘనిస్తాన్‌తో సత్సంబంధాలు నెరపాలంటూ ఆఫ్ఘన్‌ విదేశాంగ మంత్రి ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. అయితే మహిళల విద్య కల్పించే అంశంపై తమకు మరికొంత సమయం కావాలని అన్నారు. ఆఫ్ఘన్‌ చిన్నారులందరూ తిరిగి పాఠశాలలకు వెళ్ళేందుకు అనుమతించాలంటూ అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఆర్థిక సంక్షోభాన్ని నివారించే యత్నంలో భాగంగా ఇతర దేశాలతో సంబంధాలు పెట్టుకోవడానికి తాలిబన్‌ ప్రభుత్వం యత్నిస్తోంది. ''అంతర్జాతీయ సమాజం మాతో సహకరించాలి.'' అని విదేశాంగ మంత్రి అమీర్‌ ఖాన్‌ ముత్తాక్వి కోరారు. ''దీంతో అభద్రతా భావాన్ని మేం నిలువరించగలుగుతాం. అదే సమయంలో ప్రపంచ దేశాలతో సానుకూలంగా వ్యవహరించగలుగుతాం'' అని అన్నారు. దోహాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.