Oct 15,2021 09:13

పిల్లలూ, కీటకాలు చిన్నవి కాబట్టి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు అవి తట్టుకోలేవు. కానీ బంబుల్‌ బీ తన రెక్కలతో బలాన్ని ఏర్పరుచుకుం టుంది. అది ఎలాగో తెలుసుకుందామా !
బంబుల్‌ బీ తేనెటీగల జాతికి చెందినదే. చిన్ని రెక్కలతో ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుని కూడా ఎగరగలదు. ప్రపంచంలోనే ఎక్కువ ఎత్తున్న పర్వతం ఎవరెస్టు మీద వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. గాలి చాలా తక్కువగా ఉండి, జీవులకు ప్రాణవాయువు తీసుకోవడం కూడా కష్టతరమౌతుంది. అలాంటి చోట కూడా బంబుల్‌ బీ చక్కగా ఎగరగలదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ కీటకం భూమి నుంచి 30 వేల అడుగుల ఎత్తులో కూడా ఎగురగలదు. కొన్ని పక్షులు మాత్రమే ఆ వాతావరణంలో, అంత ఎత్తులో ఎగరగలవని ఇప్పటి వరకు తెలుసు. చిన్న కీటకమైన బంబుల్‌ బీకు అంత ఎత్తులో ఎగిరే సామర్థ్యం ఉండడం గొప్ప విషయం కదా! దీన్ని ప్రయోగాత్మకంగా నిరూపించారు చైనా శాస్త్రవేత్తలు. ఓ గాజు గదిలో కొన్ని బంబుల్‌బీలను ఉంచారు. చేతి పంపు ద్వారా అందులోని గాలిని నెమ్మదిగా బయటికి లాగుతూ ఒత్తిడిని పెంచారు. పూర్తిగా భూమి నుంచి 9,000 మీటర్ల ఎత్తులో వాతావరణం ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితులు కల్పించారు. ఆ ప్రతికూల వాతావరణ పరిస్థితిలో కూడా ఇవి రెక్కల్ని కొట్టుకుంటూ విస్తారంగా చాచడం ప్రారంభిం చాయి. తల, పొట్ట భాగాల వరకు చాచి గాలిని ఉత్పత్తి చేసుకున్నాయి. పరిస్థితుల్ని అనుగుణంగా మార్చుకున్నాయి. బంబుల్‌బీలల్లో దాదాపు 250 జాతులున్నాయి. దీని పేరుకు అర్థం ఝుంకారం. ఇవి రెక్కల్ని ఫ్యాన్‌లా ఆడిస్తూ వేడిగా ఉన్న తమ గూడును చల్లబరుచుకుంటాయి.