Oct 27,2021 16:31

హైదరాబాద్‌ : ప్రముఖ టాలీవుడ్‌ హీరోయిన్‌ తమన్నా భాటియా... 'మాస్టర్‌ చెఫ్‌' ప్రోగ్రామ్‌కి హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్‌కి జబర్దస్‌ యాంకర్‌, నటి అనసూయ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రోగామ్‌లో హోస్ట్‌గా తనని తీసేయడంతో తమన్నా ఈ ప్రొడక్షన్‌ హౌజ్‌కు లీగల్‌ నోటీసులు పంపించినట్లు సమాచారం. అయితే తమన్నా పంపిన లీగల్‌ నోటీసులపై తాజాగా ఈ ప్రొడక్షన్‌ నిర్వాహకులు వివరణ ఇచ్చారు. 'ఈ షోలో 18 ఎపిసోడ్‌లకు గాను తమన్నాకు రెండు కోట్ల రూపాయలు ఇచ్చేలా అగ్రిమెంట్‌ కుదుర్చుకున్నాం. అయితే తమన్నా 18 ఎపిసోడ్‌లకు గాను 16 ఎపిసోడ్‌లే పూర్తి చేశారు. రెండు ఎపిసోడ్‌లకు రాలేదు. ఆమె అలా రాకపోవడంతో.. 300 మంది టెక్నీషియన్లు పనిచేస్తున్న ఈ షో రూ. 5 కోట్ల మేర నష్టం వాటిల్లింది. దీంతో ఆమె స్థానంలో యాంకర్‌ అనసూయని తీసుకున్నామని నిర్వాహకులు తెలిపారు. అయితే తమన్నాకు అప్పటికే 1.5 కోట్ల రూపాయలు ఇచ్చారని.. ఆ మిగతా ఎపిసోడ్‌లు కూడా షూటింగ్‌ పూర్తి చేసినట్లయితే.. మొత్తం డబ్బును చెల్లించేవారమని నిర్వాహకులు అంటున్నారు. బాలీవుడ్‌ తరహాలో టాలీవుడ్‌లోనూ ఈ ప్రోగ్రామ్‌ ద్వారా ఓ వినూత్న ప్రయోగమైతే జరిగింది. ఈ షో ద్వారానే తమన్నా బుల్లితెరపైనా కనిపించి అలరించారు.
మాస్టర్‌ చెఫ్‌ ప్రోగామ్‌ ఆగస్టు 27న ప్రారంభమైంది. భారీ అంచనాలతో ప్రారంభమైన ఈ షో మొదటి మూడు షోలకు మాత్రమే మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఆ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోతుందనే చెప్పుకోవచ్చు.

tamanna 2