Nov 26,2021 11:02

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ ఇండియా యువ క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ తొలి మ్యాచ్‌లో సంచలనం సృష్టించారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో 171 బంతుల్లో 105 పరుగులు తీసి వావ్‌ అనిపించారు. తన అరంగ్రేటం టెస్టులోనే శతకం బాది అందరి చేత ప్రశంసలు పొందుతున్నాడు. తొలి రోజు మ్యాచ్‌లో శ్రేయస్‌ 75 పరుగులు తీయగా.. రెండు రోజు బ్యాటింగ్‌లో ఈ స్కోర్‌ సాధించాడు. జేమీసన్‌ వేసిన 91.1 ఓవర్‌కు రెండు పరుగులు తీసి ఈ మైలురాయి చేరుకున్నాడు. అనంతరం సౌథీ బౌలింగ్‌లో విల్‌యంగ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా, టీమ్‌ఇండియా తరఫున అరంగేట్రం టెస్టులోనే శతకం సాధించిన 16వ బ్యాట్స్‌మన్‌గా, న్యూజిలాండ్‌పై తొలి టెస్టులో ఈ ఘనత సాధించిన మూడో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.