May 03,2021 21:49

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి నానాటికీ దిగజారిపోతోరది. గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 1.04 లక్షల కోట్ల రూపాయల లోటు తేలిన విషయం తెలిసిందే. తాజగా ప్రస్తుత ఆర్థికసంవత్సరం తొలి నెలలోనే 10 వేల కోట్ల రూపాయల లోటు నమోదైంది. ఆర్థిక సంవత్సరం మొదటి నెలలోనే ఇంత గడ్డు పరిస్థితి ఏర్పడటం గతంలో ఎప్పడూ లేదని అధికారులు చెప్పారు. దీంతో ఆర్థిక వ్యవహారాల నిర్వహణ కష్టంగా మారుతోందని అంటున్నారు. అధికారుల సమాచారం మేరకు వివిధ వనరుల నుండి ఏప్రిల్‌ నెలలో రాష్ట్ర ఖజానాకు 5,036 కోట్ల రూపాయలు ఆదాయంగా లభించింది. జనవరి, ఫిబ్రవరి, మార్చిలలో నెలకు పాతిక వేల కోట్ల రూపాయల వరకు ఆదాయం లభించగా ఏప్రిల్‌లో ఆ పరిస్థితి ఒక్కసారిగా మారింది. కరోనా వ్యాప్తితో ఆంక్షలు అమలు కావడం, వ్యాపార కార్యక్రమాలపై ప్రబావం పడటం ఈ పరిస్థితి కారణంగా చెబుతున్నారు. ఆదాయం గణనీయంగా తగ్గినా ఖర్చు మాత్రం 15,165 కోట్ల రూపాయలకు చేరింది. దీరతో వచ్చిన ఆదాయం కన్నా అదనంగా 10,129 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టయైంది. ఎక్కువ రుణాలుగా తీసుకువచ్చి ఖర్చుచేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరికొన్ని ఖర్చుల కోసం ప్రభుత్వ రంగ సంస్థల నుంచి  చేబదులుగా తీసుకున్నట్లు సమాచారం. దీంతో మే నెలలో ఆదాయం ఎలా ఉంటుందన్నది అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆశించిన మేరకు ఆదాయం లేకపోతే, ఈ నెలలో సంక్షేమ పథకాల అమలు కష్టమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు అక్కడక్కడ ఫించన్లు అందలేదన్న ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే, అధికారయంత్రాంగం మాత్రం ఫించన్లకు అవసరమైన మొత్తాన్ని ఇప్పటికే విడుదల చేశామని, ఎటువంటి సమస్యలు లేవని చెబుతోంది. ఇతరత్రా కారణాలతో ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైనా సోమవారానికి అవి కూడా పరిష్కారమవుతాయని అంటున్నారు.