Sep 14,2021 21:23

హైదరాబాద్‌ : ప్రభుత్వ రంగ సంస్థ తపాలా శాఖతో టాటా ఎఐజి జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఒప్పందం కుదర్చుకున్నట్లు తెలిపింది. దీంతో ఇకపై 1.36 లక్షల పోస్టల్‌ శాఖల్లోనూ తమ బీమా ఉత్పత్తులు చౌకగా అందుబాటులో ఉంటాయని టాటా ఎఐజి పేర్కొంది. వైద్య బీమా సహా వ్యక్తిగత ప్రమాదం, మోటార్‌ బీమా ఇతర ఉత్పత్తులు లభిస్తాయని తెలిపింది. మైక్రో ఎటిఎంలు కలిగిన దాదాపుగా 2 లక్షల గ్రామిన్‌ డక్‌ సేవక్‌, పోస్టుమెన్‌ల వద్ద తమ ఉత్పత్తులు లభిస్తాయని పేర్కొంది. టాటా గ్రూపు, అమెరికన్‌ ఇంటర్నేషనల్‌ (ఎఐజి) సంస్థలు కలిసి 2001లో ఈ బీమా కంపెనీని ఏర్పాటు చేశాయి.