Jun 11,2021 21:31

ధర్నా చేస్తున్న ఉపాధి కూలీలు

ప్రజాశక్తి-విఆర్‌.పురం : ఉపాధి హామీ పథకంలో పని చేయకుండా కొంత మంది సిబ్బంది కనుసన్నల్లో ఊర్లో లేని వారి పేర్లతో తప్పుడు మస్తర్లు వేసి సొమ్ములు స్వాహా చేస్తున్నారని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ చెప్పారు. శుక్రవారం రేఖపల్లి గొల్లగూడెంలో బాధిత శ్రమశక్తి సంఘ సభ్యులు, ఉపాధి కూలీలతో కలిసి ధర్నా చేశారు. గ్రామంలో ఆరేళ్ల క్రితం మౌనికల సూరమ్మ ఇక్కడ నివసించేదని, ప్రస్తుతం ఆమె వేరే గ్రామంలో ఉంటున్నా రెండేళ్లుగా ఆమె పేరుతో మస్తర్లు వేసి సొమ్ము స్వాహా చేస్తున్నారని పూనెం సత్యనారాయణ వద్ద బాధితులు వాపోయారు అటువంటి నకిలీ అక్రమ మస్తర్లు వేసి సొమ్ములు కాజేస్తున్న వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సత్యనారాయణ అధికారులను డిమాండ్‌ చేశారు. అనంతరం ఉపాధి ఎపిఒకు ఈ ఉదంతంపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రేఖపల్లి సర్పంచ్‌ పూనెం సరోజిని గొల్లగూడెం ఉపాధి కూలీలు నాయకులు పంకు సత్తిబాబు పాల్గొన్నారు.