Sep 15,2021 23:45

వినతిపత్రం అందజేస్తున్న సిపిఎం నాయకులు

బండి ఆత్మకూరు : ట్రూ అప్‌ చార్జీల భారాన్ని ప్రభుత్వమే భరించాలని సిపిఎం మండల నాయకులు రత్నమయ్య, రామచంద్రుడు, డేవిడ్‌లు డిమాండ్‌ చేశారు. బుధవారం సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఎదుట ధర్నా నిర్వహించి అధికారి రమేష్‌ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ విద్యుత్‌ మోటార్ల మీటర్లు బిగించే ప్రక్రియను విరమించుకోవా లన్నారు. సిఐటియు నాయకులు రాముడు, సుబ్బ రాయుడు, కాంగ్రెస్‌ నాయకుడు మస్తాన్‌ రవి తదితరులు పాల్గొన్నారు.