
వాషింగ్టన్ : ట్విటర్ సంస్థలో అనూహ్యమైన మార్పులు జరిగాయి. సంస్థకు చెందిన ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించింది. ఎలన్ మస్క్ 44 మిలియన్ డాలర్ల భారీ డీల్‌తో ట్విటర్‌ను సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అనంతరం ట్విటర్ సిఇఒ పరాగ్ అగ్రవాల్‌ను తొలగిస్తార్న వార్తలు వినిపించాయి. అయితే అనూహ్యంగా ట్విటర్ హెడ్ ఆఫ్ ప్రొడక్ట్‌గా పని చేస్తున్న టాప్ ఎగ్జిక్యూటివ్ బెక్పూర్ని సంస్థను వీడి వెళ్లాల్సిందిగా సిఇఒ పరాగ్ అగర్వాల్ ఆదేశించారు. అలాగే రెవెన్యూ హెడ్ బ్రూస్ ఫలాక్‌ను తొలగించారు.
ట్విటర్ సిఇఒ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారంటూ బెక్‌పూర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇంత కాలం ట్విటర్లో సాధించిన లక్ష్యాల పట్ల తాను గర్వంగా ఉన్నానని, ట్విటర్‌ను వెళ్లి వీడాల్సిన రోజు వస్తుందని తాను ఊహించలేదంటూ బెక్‌పూర్ ట్వీట్ చేశారు. రెవెన్యూ హెడ్‌గా బ్రూస్ ఫలాక్‌ను కూడా ఆ స్థానం నుండి తొలగిస్తున్నట్లు మొదట ట్విటర్లో ప్రకటించారు. అనంతరం ఆ ట్వీట్‌ను తొలగించినా ఫలాక్‌ను మాత్రం కీలక బాధ్యతల నుంచి పక్కన పెట్టారు. కీలకమైన ఈ రెండు బాధ్యతలను జే సల్లివాన్కి అప్పగించారు.