Oct 18,2020 23:53

ఒంగోలు టౌన్‌ : స్త్రీ, పురుషుల సమానత్వ సాధన కోసం చివరి వరకూ ఉద్యమించిన తవనం సుబ్బాయమ్మ జీవితం ఆదర్శనీయమని ఐద్వా నగర కార్యదర్శి కంకణాల రమాదేవి పేర్కొన్నారు. ఐద్వా నగర కమిటీ ఆధ్వర్యంలో సత్యనారాయణపురంలో ఐద్వా సీనియర్‌ నేత తవనం సుబ్బాయమ్మ 6వ వర్ధంతిని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ సమాజంలో దోపిడీ, మహిళల అణిచివేత, కులపీడన, దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు అంతం కావాలని సుబ్బాయమ్మ ఆకాంక్షించారన్నారు. అందుకోసం తన జీవితాంతం ఉద్యమం నిర్వహించిందన్నారు. తొలుత తవనం సుబ్బాయమ్మ చిత్రపటానికి ఐద్వా సీనియర్‌ నాయకు రాలు వై. అంజినీదేవి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు జి.ఆదిలక్ష్మీ, కె.రాజేశ్వరి, ఇంద్ర, జ్యోతి, వి.రమాదేవి, జి.గురువర్ధిని, పి.సుజాత, బి.లక్ష్మీ , శేషమ్మ తదితరులు పాల్గొన్నారు