
ప్రజాశక్తి - ఎస్ఆర్ పురం : జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు రాజకీయ కుట్రలో భాగంగా అక్రమ కేసులో అరెస్టు చేసిన విధానాన్ని ఖండిస్తూ, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు, గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ థామస్ సూచనల మేరకు ఎస్ఆర్ పురం టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు గంధమనేని జయశంకర్ నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి మరియు ఆలయ చైర్మన్ బాలాజీ నాయుడు, ఆలయ వైస్ చైర్మన్ సుబ్రహ్మణ్యం నాయుడు సమక్షంలో మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడుపై వైయస్సార్సీపి ప్రభుత్వం పెట్టిన, అవినీతి అక్రమ కేసులు నుండి త్వరగా విముక్తి పొంది, ప్రజా ప్రజాక్షేత్రంలోకి రావాలని, ఆయన ఆరోగ్యం బాగుండాలని, కడిగిన ముత్యం లాగా బయటికి రావాలని మండలంలోని ఎయం పురం పంచాయతీ, సింధురాజపురం గ్రామంలో వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో శనివారం ఉదయం సింధూ రాజపురం గ్రామంలో వెలసిన శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగు యువత అధ్యక్షుడు చంద్రబాబు రెడ్డి,పుల్లూరు బాబు, వేమన్నాయుడు , సిద్దయ్య శెట్టి, కుమార్ ప్రధాన కార్యదర్శి పొన్న దామోదర్, భాస్కర్ నాయుడు, గంధమనేని వాసు నాయుడు, నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులు నరేష్, జయంతి, శారద, నిరంజన్ రెడ్డి, హేమాద్రి యాదవ్, వెంకటాచలం, కుప్పయ్య భూపతిరెడ్డి, కేశవుల నాయుడు , శేఖర్ కుమార్, బాబు, మణీ, శ్రీహరి రెడ్డి, మాధవరెడ్డి గురునాథం, కుప్పం సుధాకర్, జీవన్ రెడ్డి నాగరాజు, శేషాద్రి నాయుడు, నోమేశ్వర్ రెడ్డి, నరసింహులు, వెంకటేశు నాయకులు కార్యకర్తలు తత్తురులు పాల్గొన్నారు.