Mar 19,2023 22:01
  • తిరస్కరించిన స్పీకర్‌
  • పోడియంపై బైఠాయించిన టిడిపి సభ్యులు
  • 11 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎఫ్‌ఆర్‌బిఎం అప్పు కండీషన్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్‌ మీటర్లు పెడుతోందని, దీని వెనుక వెనుక పెద్ద కుంభకోణం వుందని ఇవి రైతులకు ఉరితాళ్లుగా మారతాయని తెలుగుదేశం ఎమ్మెల్యేలు శాసనసభలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కీలకమైన ఈ అంశంపై సభలో చర్చించాలని వాయిదా తీర్మానం ఇచ్చారు. దీనిపై చర్చించాలని పట్టుబట్టారు. అత్యవసరమైన అంశమని వెంటనే చర్చించాలని కోరారు. దీనికి స్పీకర్‌ ససేమిరా అన్నారు. దీంతో టిడిపి సభ్యులు నిలుచుని నినాదాలు చేశారు. చర్చకు అవకాశం ఇవ్వాలని కోరారు. స్పీకర్‌ స్పందించకపోవడంతో ఆయన పోడియానిు చుట్టుముట్టారు. పోడియం పైకి వెళ్లి నినాదాలు చేశారు. అప్పటికీ స్పందించకపోవడంతో పేపర్లు చించి స్పీకర్‌పై వేశారు. దీంతో చీఫ్‌ విఫ్‌ ప్రసాదరాజు టిడిపి సభ్యులను సస్పెండ్‌ చేయాలని కోరుతూ ప్రతిపాదించారు. అచ్చెనాుయుడు, చిన రాజప్ప, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, గద్దె రామ్‌మోహన్‌రావు, జోగేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణబాబు, ఏలూరి సాంబశివరావు, గణబాబు, మంతెన రామరాజు, డోల బాల వీరాంజనేయస్వామి, ఆదిరెడ్డి భవానీ, గొట్టిపాటి రవినిసస్పెండ్‌ చేస్తునుట్లు ప్రకటించారు. తాము తప్పుచేయలేదని, ఎందుకు సస్పెండ్‌ చేస్తున్నారని టిడిపి సభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు స్పీకర్‌ను ప్రశిుంచారు. ఈలోపు మార్షల్స్‌ సభలోకి రావడంతో సభ్యులు అక్కడే బైఠాయించారు. వారినిమార్షల్స్‌ బయటకు పంపించి వేశారు. అంతకుముందు టిడిపి సభ్యులు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ వుండదని, అవసరం లేదని ఇంధనశాఖ కార్యదర్శి విజయానంద్‌ రెండు పర్యాయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. సొంతమనుషులకు రూ.6 వేల కోట్లను దోచిపెట్టేందుకే మీటర్లకు మొగ్గు చూపించారని విమర్శించారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టేందుకు దేశంలోనిఏ రాష్ట్ర ప్రభుత్వమూ ముందుకురాకున్నా ఎపి ప్రభుత్వం ముందుకు వెళుతోందని అనాురు. అచ్చెనాుయుడు పూర్తిగా మాట్లాడక ముందే మంత్రులు సీదిరి అప్పలరాజు, అంబటి రాంబాబు అడ్డుతగిలారు. విద్యుత్‌ అంశంపై మాట్లాడే అర్హత తెలుగుదేశానికి లేదని అనాురు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వ్యవసాయనికి ఉచిత విద్యుత్‌ను ఇస్తానంటే ఉచిత విద్యుత్‌ సాధ్యం కాదని, తీగలపై బట్టలు ఆరేసుకునే పరిస్థితి వస్తుందని చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారని అనాురు. రైతులు విద్యుత్‌ ఛార్జీలు తగ్గించాలని అడిగితే కాల్చి చంపారని వీరికి వ్యవసాయ విద్యుత్‌పై మాట్లాడే అర్హత లేదని అనాురు. విద్యుత్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు ఈ ప్రాజెక్టును తీసుకొచ్చామని తెలిపారు. మీటర్లు వుంటే రైతులకు ప్రభుత్వం ఎంత ఇస్తుందో తెలస్తుందని, ఈ ప్రక్రియతో రైతులకు బాధ్యత వస్తుందని అన్నారు. శ్రీకాకుళంలో 18 వేల మీటర్లు వున్నాయని, ఆ జిల్లాలో తక్కువ వున్నాయనే పైలట్‌ ప్రాజెక్టుగా తీసుకున్నామని చెప్పారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడగానే స్పీకర్‌ తమ్మినేనిసీతారాం సభను వాయిదా వేశారు.