
ప్రజాశక్తి-ఇచ్ఛాపురం : మాజి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అక్రమ అరెస్టకు నిరశనగా ఇచ్ఛాపురం పట్టణంలో గత 6రోజులుగా చేస్తున్న రిలే నిరాహారదీక్షలు విజయవంతంగా కొనసగిస్తాన్నారు. ఎమ్మెల్యే అశోక్ బాబు అధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహారదీక్షలు ఆరోవ రొజు సోమవారం నాడు దీక్షా శిబిరంలో మూతికి నల్ల గుడ్డలు ధరించి నిరశన వ్యక్తం చేశారు..చంద్రబాబు నాయుడు బయటకి వచ్చినంత వరకు రిలే నిరాహారదీక్షలు కొనసాగిస్తామన్నారు. జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలనా గురించి గ్రామీణ ప్రాంతాలకు కు ప్రజలకు వాస్తవాలు తెలుసుకున్నారు అని ఎమ్మెల్యే విమర్శించారు. వినాయక చవితి కావడంతో దీక్షా శిబిరం వద్ద వినాయక విగ్రహం ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు సాలీనా ఢిల్లీ యాదవ్, కాళ్ల జయదేవ్, కొండ శంకర్ రెడ్డి, సదానంద రొలో, దక్క త డిల్లి రావు పాల్గొన్నారు.