Jul 03,2022 14:43

ప్రజాశక్తి-గూడూర్ : ఆర్టీసీ చార్జీలు పెంపుపై ఆదివారం నాడు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి కర్నూల్ పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి చరణ్ కుమార్ రాజారెడ్డి చెట్టుకింద మద్దిలేటి వీరి ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. వీర్లు మాట్లాడుతూ జూలకల్లు నుండి గూడూరు వరకు పల్లె వెలుగులో ప్రయాణం చేసి ప్రయాణికులను ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వైసిపి ప్రభుత్వం చేస్తున్న మోసాలును ప్రతి మనిషి నుండి కూలికి పోయే వ్యక్తి నుండి ప్రజలను మోసం చేస్తున్నాడని ఇలాంటి ప్రభుత్వం మాకు వద్దు అని ప్రయాణం చేసే వారిని అడిగి తెలుసుకున్నారు. అలాగే వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలపై అధిక బారాలను మోపుతూ ప్రజలను ఇబ్బందులు చేస్తూ వైసిపి ప్రభుత్వం ప్రజలు గద్దె దింపే రోజుల దగ్గర పడ్డాయని ప్రజలపై నిత్యవసర సరుకులు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ ప్రజలకు సుఖశాంతులు దూరమయ్యాయని ప్రజలను ఎదవ చేశారని వారన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని ప్రజల స్వేచ్ఛంగా జీవిస్తారని ప్రజలు చెప్పుకుంటున్నారని ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం కళ్ళు తెరిచి పెంచిన ఆర్టీసీ చార్జీలు వెంటనే తగ్గించాలని వారి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మూలగేరి లక్ష్మన్న వాల్మీకి సంఘం అధ్యక్షులు ఎం మద్దిలేటి వాల్మీకి ఉపాధ్యక్షులు సంఘాల మధు గూడూరు పట్టణ తెలుగు యువత ఉపాధ్యక్షులు వై నాగరాజు శేఖర్ గోపాల్ నారాయణ ఉప్పరి రాముడు సురేష్ గొల్ల వెంకటేష్ వడ్ల ఆచారి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.