
ప్రజాశక్తి-టెక్కలి : జాతీయ తెదేపా అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా రాష్ట్ర తెదేపా అధ్యక్షులు,టెక్కలి శాసనసభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపుమేరకు నేడు టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాళి NTR భవన్ నందు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు శ్రీ మెండ దాసునాయుడు ఆధ్వర్యంలో నాలుగు మండలాల తెలుగుయువత అధ్యక్షులు సహకారంతో సామూహిక నిరాహారదీక్షను చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల తెదేపా అధ్యక్షులు, ముఖ్యనాయకులు, తెలుగుయువత, ఐటిడిపి, TNSF ప్రతినిధులు, నియోజకవర్గం తెదేపా యువతరం మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు